డయేరియా బారిన పడిన బాధితులకు
మంత్రుల పరామర్శ
(జానోజాగో వెబ్ న్యూస్-ఆదోని ప్రతినిధి)
ఆదోని పట్టణంలోని అరుణ జ్యోతి నగర్ లో డయేరియా బారినపడి ఆదోని అరుణ జ్యోతి నగర్ లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్య చికిత్సలు పొందుతున్న బాధితులను పరామర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తదితరులు పరామర్శించారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ లో అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ లు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు అభివృద్ధి) ఎస్.రామసుందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఆదోని మున్సిపాల్ కమిషనర్ ఆర్.జి.వి కృష్ణ,అసిస్టెంట్ కమిషనర్ కెవి మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ రంగనాయక్, తహసిల్దార్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: