మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
మార్కాపురం నియోజక వర్గం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి.
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని డ్వాక్రా బజార్ లో మహిళా సంఘాలకు వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీకి రుణాలను అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమ పధకాలను ఆమలు చేయడానికి క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగిందని ఆయన చెప్పారు. మహిళలు సొంతగా తమ కాళ్ల పై తాము నిలబడటానికి సెర్ప్ ద్వారా అనేక శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందన్నారు.
వారికి ఉత్సాహం ఉన్న రంగాల్లో వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీకి రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా మార్కాపురం పట్టణం లోని1247 డ్వాక్రా సంఘాలకుఒక కోటి90లక్షల44వేల547 రూపాయల చెక్కు ను ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ,వైస్ ఛైర్మన్ ఇస్మాయిల్,మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు సి.హ్.జయమ్మ, ఏరియా కో ఆర్డినెటర్ రవి,ఏ. పి.ఎం.లుఎం. మాణిక్య రావు,డి.పిచ్చయ్య, పి.శ్రీనివాసరావు, కె.గోపాల్ రెడ్డి,మెప్మా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: