సీపీఐ ఆధ్వర్యంలో..

పట్టణంలో మాస్కులు పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి సోమన్న, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి బాల వెంకట్, సిపిఐ గోస్పాడు మండల కార్యదర్శి చెన్నయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు అజీస్ భాష,
నాయకులు నాగరాజు,  నాగన్న, భీముడు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రెండవ దఫా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. గత సంవత్సరం ఇబ్బంది పడ్డ విధంగా ఇప్పుడు ఇబ్బందులు పడవద్దన్నారు. సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో బైటిపేట, ఆటో స్టాండ్ల దగ్గర మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టణంలో ఉన్న 42 వార్డుల్లో ఫాగింగ్ చేయాలని ప్రజలకు అంటువ్యాధులు రాకుండా మున్సిపల్ అధికారులు వార్డులను శుభ్రంగా ఉంచాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి త్వరగా కరోనా టీకా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: