వర్చువల్ విధానం అవలంభించాలి
బార్ అసోసియేషన్ అధ్యక్షులు అద్యక్షులు మధుశేఖర్
మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రములో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టులో వర్చువల్ పద్ధతిన కేసులు పరిష్కరించాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుశేఖర్ సోమవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తుకారాంజీకి వినతి పత్రం సమర్పించారు. నాంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు సుమారు 25 మంది వరకు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ పేర్కొన్నారు. ఇటీవలే గైక్వాడ్, మేకల శ్రీనివాస్ సీనియర్ న్యాయవాదులు కరోనా ప్రభావం వల్ల చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారనీ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక విచారణలు చేపట్టడం మంచిది కాదని, కరోనా ప్రభావం న్యాయవాదులకు సోకే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. వర్చువల్ విధానం ద్వారా కేసుల విచారణ జరిపించాలని విన్నవించారు. కేవలం న్యాయవాదులను మాత్రమే కోర్టు ప్రాంగణంలో కి అనుమతించాలని అన్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. పోలీసులకు సైతం ఖచ్చితమైన సమాచారం అందించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: