కౌన్సిలర్ పురందర్ కుమార్ ఆధ్వర్యంలో,,

కార్యకర్తలకు ఘన సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

తన గెలుపుకు కృషి చేసి సహకరించి కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు వార్డు పెద్దలకు నూతనంగా ఎన్నికైన వార్డు యువ కౌన్సిలర్ పురందర్ కుమార్, ఆయన  తండ్రి మాజీ కౌన్సిలర్ వెంకట సుబ్బయ్యలు ఘనంగా సన్మానం చేశారు. కార్యకర్తలను మరువకుండా ఎన్నికలు అయిపోయాయి కదా అని వారిని పక్కన పెట్టకుండా తన గెలుపుకు పార్టీ గెలుపుకు అహర్నిశలు పనిచేసిన 6 వ వార్డు కార్యకర్తలకు ఘనమైన సన్మానం చేసి కృతజ్ఞతలు, అభినందనలను వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ తెలిపారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను నాయకులను వార్డు ప్రజలను మరవకుండా అందరిని గుర్తు పెట్టుకొని మరి నేడు అందరికీ దుశ్శాలువ పూలమాల వేసి ఘనమైన సన్మానం చేశారు. ఇదేవిధంగా వార్డు అభివృద్ధికి వార్డులోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలాఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సహాయ సహకారాలతో మరింత ముందుకు సాగుతానని కౌన్సిలర్ పురంధర్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా సన్మాన గ్రహీతలు, కౌన్సిలర్ పురందర్ కుమార్ తమకు చేసిన సన్మానం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: