నంద్యాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చెస్ సంఘం అడ్ హాక్ కమిటీ ఆధ్వర్యంలో, గురువారం నంద్యాల టేక్కేలో నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్ షిప్,  రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కు జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నెరవాటి కృష్ణ సాయి రోహిత్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం పిల్లల మేధస్సుకు పదును పెడుతుందని, విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను చదువుతోపాటు కళలు, క్రీడలలో కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణ సాయి రోహిత్ మాట్లాడుతూ తమ పాఠశాలలో క్రీడల  పోటీలకు సహకారం అందజేస్తామన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో ప్రతిభ చూపించిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని, వీరు నెల్లూరులో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ పీజీ కళాశాల కరస్పాండెంట్ హేమంత్ రెడ్డి, స్కూల్ అకడమిక్ అడ్వైజర్ సాయి ప్రభాకర్, చెస్ కోచ్ ఇమామ్ హుస్సేన్ ,పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజా రమేష్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: