కమిషనర్ జి లావణ్య లత,,,
పరిచయ కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)
ఆలేరు మున్సిపాలిటీకి నూతనంగా నియామకం అయినటువంటి కమిషనర్ జి లావణ్య లత పరిచయ కార్యక్రమం ఆలేరు మున్సిపాలిటీ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ పాల్గొని మాట్లాడుతూ ఆలేరు పట్టణానికి కమిషనర్ గా వచ్చినటువంటి జి లావణ్య లత గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు మున్సిపాలిటీలోని పాలకవర్గం కౌన్సిలర్లు చైర్మన్ కమిషనర్ అందరూ ఐక్యంగా ఉండి ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి పధం లో నడిపించాలని అదేవిధంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి కుటుంబాలకు నిత్యావసర సరుకులు త్రాగునీరు మున్సిపల్ పాలకవర్గం అందించాలని ఐసోలేషన్ లో ఉన్నటువంటి కుటుంబం యొక్క ఇళ్ల నుండి చెత్త ను తొలగించడం లో ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి మనోధైర్యం కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు
Post A Comment:
0 comments: