రక్తదాతలకు చైతన్య పరుద్దాం
తలసీమియా మరణాలను నివారిద్దాం
ప్రాణదాతలుగా మారుదాం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన.రక్త దానం చేద్దాం-తలసీమియా మరణాలను నివారిద్దాం అనే కార్యక్రమము హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో 4.5కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా భారతదేశంలోమూడు కోట్ల యాభై లక్షల మంది తలసీమియా మహమ్మారి తో బాధ పడుతున్నారని ప్రతి 20రోజులకు రక్తం దాతల ద్వారా దొరకక పోతే మరణమే శరణ్యమని ప్రతి 18సంవత్సరాలనుండి 55సంవత్సరాల ఆరోగ్యవంతులు బ్లడ్ బ్యాంక్ రక్త నిధి కి వెళ్లి స్వచ్ఛoదంగా రక్తదానం చేసి కోట్లాది తలసీమియా బాధితుల కు ప్రాణదానం చేయవలసిన బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.
స్వచ్చందంగా తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తనిధి కి వచ్చి రక్తదానం చేసిన యహ్యా యాష్ ఆడిటర్.ఫోటో గ్రఫీ విద్యార్థి వసీమె.ఇలియాజ్ ఖాన్ ను డాక్టర్ శివకుమార్ నాయక్ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో .టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్.టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం పట్టణ అధ్యక్షులు నాజిమ్ పటేల్.యాసిర్ అరఫాతుల్లా.తదితరులు పాల్గొని రక్తదాతలకు అభినందించారు.
Post A Comment:
0 comments: