తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...
ప్రైవేట్ టీచర్స్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభం
(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ టీచర్స్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్ పాషా మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రైవేట్ టీచర్స్ ఎంతమంది ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. కరోనా కారణంగా స్కూల్స్ మూతబడి ఉద్యోగం మరియు ఉపాధి లేక ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ కౌన్సెలింగ్ సెంటర్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్థిక సమస్యలు మరియు ఇతర సమస్యలతో సతమతమవుతూ డిప్రెషన్ కారణంగా ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపి వారికి జీవితం యొక్క విలువ తెలియజేసి స్వయం ఉపాధి మార్గాలు చూపించి వారి జీవితాలను మెరుగుపరచడం ఈ కౌన్సెలింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు సిద్ధా సాహెబ్, బుచ్చి రామి రెడ్డి,నరేష్ కుమార్ సూరిబాబు రంగారావు, గణేష్ విజయ భాస్కర్, రమాకాంత్, చంద్రశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: