రైట్ డైరెక్షన్ లో రాంగ్ నెంబర్‌ 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఆర్వీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆర్వీఎస్‌, ఫర్హానా నస్రీన్‌ నిర్మాతలుగా.. రూపొందిస్తున్న చిత్రం "రాంగ్ నెంబర్‌".  ఈ చిత్రానికి ఆర్వీ సాంబశివరావు దర్శకత్వం వహించారు. నూతన నటీనటులు మారుతీరామ్‌, జియోడార్ల జంటగా సీనియర్ నటుడు అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ లాంచ్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత మైత్రీ మూవీస్‌ అధినేత ఎర్నేని నవీన్‌ ఆవిష్కరించారు. 

     ఈ సందర్భంగా.. ఎర్నేని నవీన్‌ మాట్లాడుతూ.. “ లవ్‌, క్రైమ్‌,యాక్షన్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్ అంశాలుగా తీసుకుని రూపొందించిన సినిమా ఈ రాంగ్ నెంబర్‌. ఈ మూవీ సక్సెస్‌ కావాలని కోరుతూ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్‌, ఫస్ట్‌లుక్ చాలా బావుంద"ని కితాబిచ్చారు. 

    చిత్ర దర్శకుడు ఆర్వీ సాంబశివరావు మాట్లాడుతూ.. “ మేము అడగగానే మంచి మనసుతో ఎర్నేని నవీన్‌ గారు మా సినిమా ఫస్ట్‌లుక్ , ట్రైలర్‌ లాంచ్‌ చేయడం మా సినిమా సక్సెస్‌గా ఫీలవుతున్నాం. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు స్వర్గీయ ఆర్‌ నాగేశ్వరరావు ముని మనవడు  రాజనాల సతీష్‌ని విలన్‌గా పరిచయం చేస్తున్నాం. అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. సినిమా నిర్మాణం విషయంలో దేనికీ వెనకాడకుండా సహకరించిన నిర్మాతలు ఆర్వీఎస్‌, ఫర్హానా నస్రీన్‌ లకు ప్రత్యేక కృతజ్ఞతలు"

    హీరో మారుతీరామ్‌ మాట్లాడుతూ.. “ సక్సెస్‌ఫుల్ నిర్మాత నవీన్‌ గారి చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్‌లుక్,  ట్రైలర్‌ లాంచ్ చేయడం చాలా ఆనందంగా , గుర్తుండిపోయేదిగా వుంది. సినిమా విషయానికొస్తే.. ఇది తొలిసినిమా. తోటి నటీనటులు, సాంకేతిక వర్గం మంచి సహకారాన్ని అందించారు. అందరు మెచ్చే విధంగా ఈ సినిమా వుంటుంది".

     మారుతిరామ్‌, జియో డార్ల, అజయ్‌ ఘోష్‌, షేకింగ్ శేషు, సుమన్‌ శెట్టి, రాజనాల సతీష్‌ నాయుడు, రోషిక, హాసిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఆనంద్‌ మరుకుర్తి, సంగీతం ఈశ్వర్‌ హేమకాంత్‌, ఆర్ట్‌ విజయ్‌ కృష్ణ, కాస్ట్యూమ్స్ సురేష్‌, ఫైట్స్‌ ఎన్‌ దేవరాజ్‌, కొరియోగ్రఫీ అమ్మ సుధీర్‌ గోగినేని, స్టిల్స్ ప్రవీణ్‌ కఠారి, కథ స్క్రీన్‌ప్లే పాటలు మాటలు దర్శకత్వం ఆర్వీ సాంబశివరావు, నిర్మాతలు ఆర్వీఎస్‌, ఫర్హానా నస్రీన్!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: