వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం

ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

 వాలంటీర్ల  సత్కార కార్యక్రమం లో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

దేశానికే ఆదర్శంగా, గ్రామ సచివాలయ,వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక మార్కాపురం పట్టణం లోని డ్వాక్రా బజార్ లో వాలంటీర్లుకు పురస్కారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించడము జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తేదిన అవ్వా తాతలకు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.జిల్లాలో 4.5లక్షల మంది యువత కు గ్రామ,వార్డు ల్లో వాలంటీర్లుగా నియమించడము జరిగిందన్నారు. అందులో 50శాతం మహిళలకు 50శాతం పురుషులకు కేటాయించడము జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ప్రభుత్వం నియమించడ ము జరిగిందన్నారు.కోవిడ్ సమయంలో వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించారన్నారు.

 ఎమ్మెల్యే కుందూరు. నాగార్జున రెడ్డి

వాలంటీర్లు పనితీరును ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సాహించడానికి నగదు పురస్కారాన్ని అందించడం జరుగుతుందన్నారు.భవిష్యత్ లో వాలంటీర్లు కు ప్రోత్సాహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ వాలంటరీ ల సత్కార కార్యక్రమంలో పాల్గోన్న మార్కాపురం పట్టణ మునిసిపల్ ఛైర్మన్ బాలమురళీక్రిష్ణ మాట్లాడుతూ ఈ సందర్భంగా మెరుగైన సేవలు అందించిన వాలంటరీ లకు  సత్కారాలు అందించారు  ప్రజల కష్టాలు తీర్చేందుకు వారి సమస్యలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టారని...ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న వాలంటరీల సేవలను గుర్తించి వారిని సీఎం జగన్ సత్కరించటం ఎంతో ఆనందంగా ఉందని గ్రామ వాలంటీర్ల సేవలు ఎంతో విలువైనవని రానున్న రోజుల్లో ఇలానే ప్రజలకు మెరుగైన  సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, వైస్ ఛైర్మన్ ఇస్మాయిల్, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, డివిజనల్ డేవలేప్ మెంట్ ఆఫీసర్ సాయి కుమార్, ఎంపీడీఓ హనుమంతరావు, తహసీల్దార్ విద్యాసాగరుడు, తదితరులు పాల్గొన్నారు.




✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: