ఎరువుల ధరలు తగ్గించాలి
సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని నందికొట్కూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎరువుల బస్తాలను రోడ్డు మీద పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన పాలక ప్రభుత్వాలు ఎరువుల ధరలను ఒక బస్తా పై 500 నుండి 700 రూపాయల దాకా పెంచడం మూలంగా ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో బడి రైతులు పెట్టిన పెట్టుబడులు రాక చేసిన అప్పులు తీర్చలేక ప్రతి సంవత్సరం 16,000 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులను ఆదుకోవాల్సిన మోడీ ప్రభుత్వం ఆది కాకపోగా రైతుల ఆత్మహత్యలను పెంచేదిగా ఈ ప్రభుత్వ విధానం ఉందన్నారు ఇప్పటికే మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొనివచ్చి రైతాంగాన్ని రోడ్డుకు నెట్టేసింది అని ఆరోపించారు విద్యుత్ చేయడం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం మూలంగా గా ప్రజల పైన విపరీతమైన భారాలు మోపుతోందని వారు ఆరోపించారు పెరిగిన ఎరువుల ధరలను తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు దీనిపై రాష్ట్రములోని వైఎస్ఆర్ టిడిపి జనసేన పార్టీ లు వైఖరి స్పష్టం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బెస్త రాజు పి ఫక్కిర్ సాహెబ్ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు ఓబులేసు మదర్స మౌలా బి రామ సుబ్బయ్య మల్లికార్జున్రెడ్డి లింగాపురం మాజీ సర్పంచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: