రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యం మే ప్రభుత్వ లక్ష్యం

- నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం అని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. గురువారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, కార్యాలయ పరిపాలన అధికారి హరినాథ్ రావు,  డివైఎస్ఓ అల్లిపిరాతో కలిసి ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు,  పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలకు  సంబంధించిన విపత్తుల శాఖ వారిచే  జారీచేయబడిన వాల్ పోస్టర్ లను విడుదల చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ మన రెవెన్యూ డివిజన్లో  సెకండ్ వేవ్ కరోన  విజృంభిస్తుందని వైద్య అధికారులు తెలియజేస్తున్నారని,  కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి  ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు కోవిడ్ 19 దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించాలని,  చేతులను సబ్బు నీటితో శుభ్రపరుచుకుంటు ఉండాలని, 
శానిటేషన్ తో శుభ్రపరుచుకుంటు ఉండాలని, మాస్కులు ధరించాలని ఆనారోగ్యంతో ఉన్నట్లయితే ఎండలో తిరక్కుండా  ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలని ఎండ తీవ్రతకు గురికాకుండా తలపైన టోపీ ఉంచుకోవడం, కాటన్ వస్త్రాలను ధరించడం, కంటి రక్షణ కొరకు చలవ అద్దాలను వినియోగించడం,  దాహము వేయకపోయినా తరచుగా నీటిని తీసుకోవడం, ఉప్పు కలిపిన మజ్జిగనూ, ఓఆర్ఎస్  కలిపిన నీటిని త్రాగడం, వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి  వైద్యులను సంప్రదించాలని,ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా గొడుగును వాడాలని,  బాలింతలు చిన్నపిల్లలు వృద్దులు  ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: