తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్.. 

హైకోర్టు కీలక నిర్ణయం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు సంచలనమైన మార్పులు తీసుకువచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల పని విధానానికి సంబంధించి కీలక మార్పులు తెచ్చింది. గతంలో మాదిరిగానే పరిమిత సంఖ్యలోనే కేసులను విచారించాలని ఆదేశాలిచ్చింది. రోజుకు 20 కేసులు మాత్రమే విచారణ చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.  దీంతో పాటు బార్ అసోసియేషన్లు, క్యాంటీన్లు తెరవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు రోజువారీగా కాకుండా వీలైనంత వేగంగా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య రోజుకు వెయ్యికి పైగా నమోదవుతుండటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం అనేక నిబంధనలు అమల్లోకి తీసుకురాగా.. తాజాగా హైకోర్టు కూడా కీలక మార్పులు చేపట్టింది.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: