ఘనంగా అంబేద్కర్, జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు

అద్యక్ష, ప్రధాన కార్యదర్శులచే కేక్ కటింగ్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్. అంబేడ్కర్, బీసీ నేత జ్యోతీరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మధుశేఖర్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లతో పాటు సభ్యులచే కేక్ కటింగ్ నిర్వహించారు. స్పోర్ట్స్ కార్యదర్శి వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు కేకు తినిపించారు. ఫోటోలకు పూల దండలు వేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సదర్భంగా అద్యక్షులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్. అంబేడ్కర్ సేవలను కొనియాడారు. న్యాయవాదులుగా న్యాయాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కూడా కేక్ లను అందరికీ పంపిణీ చేశారు. బీసీ నేతగా పూలే జయంతి వేడుకలను నిర్వహించడం మన ప్రధాన కర్తవ్యమని గుర్తు చేశారు. పూలే అందించిన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుం బిగించాలని గంగపుత్ర రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు చింతల కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లక్ష్మణ్ గంగా, ఆనంద్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, న్యాయ వాదులు శ్యామ్ సుందర్, శంకర్,  తదితరులు పాల్గొన్నారు.
 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: