బ్యాక్ డోర్ కు క్లీన్ 'యు'

భారీ కాంప్లిమెంట్స్!!,,సెన్సార్ పూర్తి చేసుకున్న

కర్రి బాలాజీ 'బ్యాక్ డోర్'

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)     

     పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న 'బ్యాక్ డోర్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా... దర్శకనిర్మాతలపై సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. 

     నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 

"బ్యాక్ డోర్"లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు... అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. మా చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకోవడం మా తొలి విజయంగా భావిస్తున్నాం. మా దర్శకుడు బాలాజీకి మరిన్ని అవార్డులు, నిర్మాతగా నాకు రివార్డులు తెచ్చే చిత్రమిది. పూర్ణతోపాటు... హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు.


     ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: