బాబు జగ్జీవన్ రామ్ కు,,,

చింతల మోహన్ రావు ఘన నివాళి

నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతిని నంద్యాల కాంగ్రెస్ కమిటీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత దేశ ఉప ప్రధానమంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం తెచ్చిన రైతు అని, ఆహార శాఖ మంత్రిగా ఆహార గిడ్డంగులను ప్రవేశపెట్టిన భవిష్యత్ ప్రదాత, రైల్వే మంత్రిగా బ్రిటిష్ రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతీయత ముద్రను సాధించిన భారతీయుడు, ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పొందుపరిచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
అటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాని తుంగలో తొక్కి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజల హక్కులను కాలరాస్తూ వారి పార్టీ మనుగడ సాధించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరూ కూడా ఏకధాటిగా తిరస్కరించ వలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీప్రసాద్, బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు రవి బాబు, పసుపుల అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: