ఇంజనీరింగ్ విద్యార్థికి పూర్తి సహకారం అందిస్తాం
- ఎల్.ఐ. సి. ఏజెంట్స్, బివి కుమార్, బివి.సరస్వతి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
పేదరికం కళ్ళముందు విలయ తాండవం, తల్లిదండ్రులది పేద కుటుంబం, చదువుపై ఆసక్తి, ఇంజనీయర్ కావాలని చిన్నప్పటినుండి కళ, కాలం కలిసి రాలేదు, ఉన్న ఊరిలో పనులు చేయలేక చదువుపై మక్కువతో ఊరు విడిచాడు దిలీప్ కుమార్. పాణ్యంలో ఓ హోటల్లో పని కుదుర్చుకుని ఇంజనీరింగ్ చదువుతున్నారు. హోటల్ లో పని చేస్తూ ఇంజనీరింగ్ చదువుతున్న విషయాన్ని గమనించిన పాత్రికేయులు తమ వంతు సహాయంగా అందరూ తమ పత్రికల్లో, ప్రచారసాధనల్లో విద్యారి ఆసక్తి, పేదరికాన్ని కళ్ళకు కుట్టినట్లుగా ప్రజలకు తెలియజేసారు. సమాజంలో మానవతా మూర్తులకు కొదవ లేదని నిరూపించారు పాణ్యం కు చెందిన బివి కుమార్, బి సరస్వతి దంపతులు. నంద్యాలలో ఎల్.ఐ. సి. ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.
ఇటీవల అమెరికాలో నిర్వహించే ఎం.డిఆర్.టి.కి బి సరస్వతి అర్హత సాధించారు. డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ కు చదువుపై ఆసక్తి, పేదరికంతో హోటల్ లో పనిచేస్తూ చదువుకునేవారు. విద్యార్థి పరిస్థితి గమనించిన బివి.కుమార్, బి.సరస్వతిలు విద్యార్థికి భరోసా ఇస్తూ, రెండున్నర కాలం ఫీజులతో పాటు అన్నిరకాలుగా ఆదుకుంటామని పత్రికా ముఖంగా తెలియజేసారు. గత 20 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎల్.ఐ.సి. ఎమ్. రాకేష్, గ్రామ పెద్ద కరుణాకర రెడ్డి, ఎ. వి. రమణయ్య, చందమామ బాబు శ్రీనివాసరెడ్డి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: