అమర్నాథ్ మరణం తీరనిలోటు
ఎమ్మెల్యే క్రాంతి
ఎమ్మెల్యే క్రాంతి
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు అమర్నాథ్ మరణం తీవ్రంగా కలచివేసింది సీనియర్ జర్నలిస్ట్, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అందరిని ప్రేమగా పలకరిస్తూ ప్రతి ఒక్కరినీ తన బిడ్డలాగా చూసే అమర్ నాథ్ గారు కరోన బారినపడి మరణించడం బాధాకరం. మేము ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటుచేయడంలో అమర్ నాథ్ గారి ప్రోత్సాహం సహకారం మరువలేనిది. ట్రేడ్ యూనియన్ గురించి మా లాంటివారందరికి పాఠాలు నేర్పిన వాడు. మా తరం జర్నలిస్ట్ లను ప్రేమ గా ఒరేయ్ అని పలకరించే పెద్దమనిషి లేనిలోటు పూడ్చలేనిది. అమర్ నాథ్ సార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అని పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: