బాబూ జగ్జీవన్ రామ్ కు...
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఘన నివాళి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
హరిజన, బడుగు బలహీన, గిరిజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ చంద్ర శేఖర్, మాజీ కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్, మునెయ్య, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: