అల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,,, 

డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషకు సన్మానం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీమ్ బుధవారం  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,  మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషను  మర్యాద పూర్వకంగా కలసి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం మైనారిటీలను  రాజకీయంగా అభివృద్ధి చేసే దిశగా ముగ్గురికి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడం,  అందులో ఇద్దరు మహిళలు ఉండడం శుభపరిణామమని, 12 మంది మున్సిపల్ చైర్మన్లుగా ముస్లిం మైనారిటీలకు  కేటాయించడం ముస్లిముల రాజకీయ అభివృద్ధికి  పాటు పడుతున్నారని చెప్పవచ్చన్నారు. ఇందుకోసం  ముస్లింలందరూ  ముఖ్యమంత్రి జగన్ అన్నకు,  మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి  అంజాద్ బాషకు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని చైర్మన్ ఆకుమల్ల రహీం తెలిపారు. అదే విధంగానే ముస్లింలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కొరకు ముస్లిం సంక్షేమ పథకాలు అయిన దులహన్ పథకం ద్వారా పెండ్లి కూతురుకు లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,
జగనన్న ప్రభుత్వంలో ఈ దులహన్ పథకం అమలులోనికి తీసుకొని వస్తే, ఈ పథకం ద్వారా ముస్లింలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కావున తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. తర్వాత మసీదులో పనిచేసే ఇమామ్ కు పదివేల రూపాయలు, మౌజన్ లకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరడం జరిగిందన్నారు. మైనారిటీ విద్యార్థులు విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ విదేశీ విద్యా రుణం ద్వారా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ పథకాలను అమలు పరచడం ద్వారా ముస్లిం మైనార్టీలు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారని కోరడం జరిగిందన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: