కొలువు తీరిన కొత్త దళం

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన సభ్యులకు శుభాకాంక్షలు

పదవీ బాధ్యతలు చేపట్టిన సభ్యులు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలతో పాటు అందరు సభ్యులతో కొలువు తీరింది. అధ్యక్షులుగా మధుశేఖర్, ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టి ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఉపాధ్యక్షులు చంద్ర శేఖర్ గౌడ్, లక్ష్మి నారాయణ, ట్రేజరర్ ఆనంద్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉన్నారు. కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కోర్టు కార్యకలాపాల గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు ముందుకు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

యువకులతో కూడిన కొత్త దళం పైనే అందరి దృష్టీ కేంద్రీకరించడం విశేషం. అద్యక్షులు, ప్రధాన కార్యదర్శి ముందుండి నడిపిస్తారు అనే ఆశలు చిగురించాయి. సభ్యులందరూ పట్టుదలతో ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా ముందున్న ప్రధాన సవాళ్ళను ఎదుర్కొనే పద్దతులను పాటిస్తే భవిష్యత్తు కార్యాచరణ సజావుగా సాగడానికి వీలువుతోందని భావిస్తున్నారు. న్యాయ వాద మిత్రులందరూ కొత్త దళం సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని "" జర్నలిస్టు   సభ్యుల "" తరఫున కొత్త సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ.....  అభివృద్ధి కోసం చేసే అన్నీ కార్యక్రమాలకు మీ వెంటే ఉంటూ వార్తల సమాహారం అందించేందుకు కృషి చేస్తానని కోరుకుంటూ ...



 

డి. అనంతరఘు. న్యాయవాది

Ex. Executive member. MCCBA.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: