యువకళావాహిని  స్ఫూర్తి కొనసాగాలి  

- తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి 

- వై కె కు ఘనంగా శ్రద్ధాంజలి 

దివంగత వై.కె.నాగేశ్వరరావు కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఎస్.వేణుగోపాలాచారి, డాక్టర్ ఓలేటి పార్వతీశం, గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీలత, కళా జనార్ధన మూర్తి, చిల్లా రాజశేఖర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

యువకళావాహిని వ్యవస్థాపకులు వై కె నాగేశ్వరరావు సాంస్కృతిక రంగం లో విశేష సేవలు అందించారని, వారు లేకున్నా వారి స్ఫూర్తి కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి కోరారు. వై.కె.నాగేశ్వరరావు పేరిట పురస్కారం నెలకొల్పితే ఆ పారితోషిక నగదును  తాను బ్రతికినంత కాలం సొంతగా ఇస్తానంటూ  ఆయన ఘన నివాళులు అర్పించారు. కళ పత్రిక, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువకళావాహిని సంయుక్త ఆధ్వర్యం లో శనివారం త్యాగరాయ గానసభ లో దివంగత వై కె నాగేశ్వరరావు సంతాప సభ జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్.వేణుగోపాలాచారి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వై కె నాగేశ్వరావు  ఎన్నో సాంస్కృతిక సంస్థలకు అంకురార్పణ చేశారని కొనియాడారు.
సభాధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ వర్ధమాన కళాకారులకు లబ్ద  ప్రతిష్టులకు  సమాంతర  వేదిక కల్పించి ప్రోత్సహించిన ఘనత వైకె నాగేశ్వరరావు కు మాత్రమే సొంతం అన్నారు. కలుషితమయిన  సాంస్కృతిక రంగం లో నిస్వార్ధ సేవలు అందించిన ఆదర్శమూర్తి  అని శ్రద్ధాంజలి ఘటించారు. రచయిత్రి శ్రీలత మాట్లాడుతూ నాగేశ్వరరావు మృతిని   జీర్ణించుకోలేక పోతున్నామని,  రచయిత్రులు ఎందరికో సముచిత స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చిన మహోన్నతమయిన  సాంస్కృతిక ఉద్ధండుడు అని నివాళులు అర్పించారు. కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ సమన్వయము లో సాగిన సభ లో నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, కళా జనార్ధన మూర్తి, డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, పండిట్ అంజుబాబు, లంక లక్ష్మి నారాయణ, తెలుగు యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు నిర్మల ప్రభాకర్, దైవజ్ఞ శర్మ, జి.నెహ్రూ, బొప్పన నరసింహారావు, కవయిత్రి మహె జబీన్, రచయిత తులసి బాలకృష్ణ, బి.నాగయ్య  తదితరులు పాల్గొన్నారు.  సభ కు ముందు ఆమని, భూదేవి, ప్రవీణ్ కుమార్, సుభాష్, పవన్ తదితరులు సినీ పాటలతో నివాళి అర్పించారు. యువకళావాహిని కార్యదర్శి జి.మల్లికార్జున్ పర్యవేక్షించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: