జార్జి రెడ్డి ఆదర్శం యువత తీసుకోవాలి

మతోన్మాద వ్యతిరేక పోరాటమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి 

పీడీఎస్ యూ, పీవైఎల్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

దేశంలో మతోన్మాదులు చేస్తున్న దాడులకు వ్యతిరేక పోరాటం చేయడమే జార్జిరెడ్డికి నిజమైన నివాళ్ళు అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రగతిశీల యువజన సంఘం  పి వై ఎల్  జిల్లా నాయకులు  యూ.నవీన్ కుమార్ పిలుపునిచ్చారు . . అనంతరం జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ 1972 ఏప్రిల్ 14 వ తేదీన మతోన్మాద దాడులకు బలి అయ్యారని , అప్పటి నుండి ఇప్పటి వరకు విద్యారంగంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు . అదేవిధంగా బిజెపి ప్రభుత్వంలో నేడు దేశంలో దళితులపై , మైనార్టీలపై , జర్నలిస్టులపై , కవులపై మతోన్మాద దాడులు జరుగుతున్నాయన్నారు . నేటి యువత జార్జిరెడ్డిని ఆదర్శ , గా తీసుకొని మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేశార న్నారు . జార్జిరెడ్డి చూపిన బాటలోనే అందరూ నడవాలన్నారు . ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు డివిజన్ నాయకులు వెంకటేష్ శివ ,పవన్  తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: