‘గుండె క‌థ వింటారా’ చిత్రంలోని

`ఎంత బావుందో...‌` లిరిక‌ల్ సాంగ్‌ విడుదల 

(ధన్ రాజ్.పి-జానోజాగో వెబ్ న్యూస్)

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై  క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి  `ఎంత బావుందో...‌` లిరిక‌ల్ సాంగ్‌ని విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా...గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి  మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య  సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ‌

తారాగ‌ణం:

మ‌ధునంద‌న్, స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వంశీధ‌ర్

నిర్మాత‌లు : క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప

బ్యాన‌ర్‌: ట్రినిటి పిక్చర్స్

సినిమాటోగ్ర‌ఫి: ర‌వి వ‌ర్మ‌న్ నీలిమేఘం, సురేష్ భార్గ‌వ్‌

సంగీతం: మ‌సాల కాఫీ

ఎడిట‌ర్‌: సాయి కిర‌ణ్ ముద్దం

యాక్ష‌న్‌: `రియ‌ల్` స‌తీష్

కొరియోగ్ర‌ఫి: భాను మాస్ట‌ర్

లిరిక్స్‌: కృష్ణ చైత‌న్య

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  గౌరీ నాయుడు

పిఆర్వో:  వంశీ- శేఖ‌ర్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: