నూర్ ఆసుపత్రిలో...
ప్రసూతి, స్త్రీ వైద్య విభాగం ప్రారంభం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలో నివసిస్తున్న పేద ప్రజలకు నూర్ నర్సింగ్ హోమ్ దేవుడిచ్చిన వరమని, ఆసుపత్రిలో ప్రసూతి, స్త్రీ వైద్య విభాగం ప్రారంభించడం ఆనందంగా ఉందని మౌలానా ఖలీల్ పేర్కొన్నారు. చాంద్ బాడాలో చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ బాబన్ కు చెందిన నూర్ నర్సింగ్ హోంలో గురువారం వైద్యురాలు ఫాతిమాబీ ఆధ్వర్యంలో ప్రసూతి, స్త్రీ వైద్య విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా డాక్టర్ బాబన్ పేద ప్రజలకు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. మహిళల కోసం ప్రసూతి వైద్య విభాగం ఏర్పాటు చేసి పరదా పద్దతిలో కాన్పులు చేయడం ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైద్యులు, నూర్ బాష సంఘ నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: