సుప్రీం సీ.జే.గా తెలుగు తేజం
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వీ.రమణ నియామకంకావడం యావత్తు తెలుగు జాతికి గర్వకారణమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా పేర్కొన్నారు. దేశంలోని అత్యున్నత న్యాయ స్థానంలో 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వీ.రమణ బాధ్యతలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పెట్టి స్వయంశక్తితో ఎదిగి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఆయన దేశంలోనే తెలుగు ఖ్యాతిని చాటిచెప్పారన్నారు. ఆయన నియామకం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: