ప్రజల్లో చైతన్యం నిజాయితీకి పట్టం
ఆటోలో దొరికిన సొమ్మును నిజాయితీగా బాధితురాలికి అందజేసిన ఆటో డ్రైవర్
- అభినందించిన పట్టణ సిఐ ఓబులేసు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలో నిన్న మధ్యాహ్నం మిడుతూరు మండలం దేవనూరు గ్రామానికి చెందిన మండ్ల సుబ్బమ్మ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కి, వన్ టౌన్ పోలీస్ దగ్గర బంగారు షాపుల వద్ద దిగింది. తన వద్ద ఉన్న కవరును ఆటోలోనే మర్చిపోయింది. అందులో పది వేల ఏడు వందలు రూపాయల నగదు,18 వేల రూపాయల బంగారు కమ్మలు, ఒక ముక్కుపుడక ఆటోలోనే మర్చిపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత తన చేతిలో కవర్ లేకపోవడంతో తాను కవరును ఆటోలో మర్చిపోవడం గుర్తుకు రావడంతో దగ్గర్లో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది.
ఆటోలో ప్రయాణికులను దించి ఆటో డ్రైవర్ సునీల్ ఫారుక్ నగర్ వద్ద పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకుని చూడగా ఒక కవర్ కనపడటంతో ఆ కవర్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి ఆ కవరును వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చాడు. సొమ్ములను పోగొట్టుకున్న మండ్ల సుబ్బమ్మను వన్ టౌన్ సిఐ ఓబులేసు పిలిపించి పోలీస్ స్టేషన్ నందు సిఐ ఓబులేసు, ఎస్ఐ అశోక్ సమక్షంలో ఆ సొమ్మును బాధితురాలికి అప్పజెప్పారు. ఆటోడ్రైవర్ సునీల్ నిజాయితీకి వన్ టౌన్ ఓబులేసు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సిబ్బంది మాలిక్, రామసుబ్బయ్య, అమీర్ భాషాలను ప్రత్యేకంగా అభినందించారు. ఆటో డ్రైవర్ సునీల్ కు నగదు బహుమతిని సిఐ అందజేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: