పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

 కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల రసాయన ఎరువుల ధరలు ఎన్నడూ లేని విధంగా58% శాతం పెంచడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎం ఆర్ వో కార్యాలయం లోని డిప్యూటీ ఎమ్మార్వో శ్రీమతి.రమాదేవి గారికి.డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్.  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు. ఏ. సుబ్బరాయుడు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. హరినాథ్. ఓబులేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను నష్ట. కష్ట.పరిచే విధంగా పెట్రోల్. డీజిల్ ధరలు. నిత్యావసర ధరలు వంట గ్యాస్ ధరలు. పెంచడంతో ప్రజలు.అనేక ఇబ్బందులు పడుతున్నరని అన్నారు. ఇప్పుడు రైతుల పై భారం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల రసాయన ఎరువులు పై ఎన్నడూ లేని విధంగా 58 శాతం పెంచడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు భరించలేక అనేక మంది రైతులు వ్యవసాయ రంగానికి దూరం అవుతున్నా రణి గ్రామాల్లో పశుసంపద గణనీయంగా తగ్గినoదువల్ల సేంద్రియ ఎరువులు లభించడం లేదు ఈ క్రమంలో రసాయన ఎరువులు వాడకం వలన గణనీయంగా పెరిగినందువల్ల ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన ధరలతో వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వము డి  ఏ పి కాంప్లెక్స్ ఎరువుల ధరలను 58 శాతం పెంచినట్టు ప్రకటించి అందుకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం అమలు  చేయడంతో ఒక ఎకరాకు ఏడు వేల నుండి పదివేల వరకు సాగు ఖర్చులు పెరుగుతాయని అన్నారు. ఇప్పటికే బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తూ ఒకపక్క రైతు వ్యతిరేక చట్టాలను చేస్తూ మరోపక్క ఎరువుల ధరలను పెంచడం అమానుషమని వెంటనే పెంచిన రసాయన ఎరువుల ధరలను తగ్గించాలని.  పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించాలని పై నాయకులు డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: