ఎం.డి.ఆర్.టి కి అర్హత సాధించిన బి. సరస్వతి
- ఏడాదిలో ఎం.డి.ఆర్.టి, గెలాక్సీ క్లబ్ లో అర్హత
- అమెరికాలో సమావేశానికి నంద్యాల మహిళ
బి. సరస్వతి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ప్రపంచంలోని జీవిత భీమా సంస్థలోని ఏజంట్లకు అమెరికాలో నిర్వహించే సమావేశానికి నంద్యాలకు చెందిన బి.సరస్వతి అర్హత సాధించినట్లు ఎల్.ఐ. సి. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సి.రాజశేఖర్ తెలిపారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎల్.ఐ. సి. కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఎల్.ఐ.సి ఏజంట్లకు అమెరికాలో ఒక సమావేశం నిర్వహిస్తారన్నారు. సమావేశానికి అర్హత సాధించాలంటే ఏజెంట్ ఏడాదిలో 22 లక్షల ప్రీమియం కట్టిస్తే అర్హత పొందుతారన్నారు. ఏడాది క్రితం ఎల్.ఐ. సి. ఏజెంట్ గా చేరి ఏడాదిలో చేయాల్సిన పని కేవలం మూడునెలలో సాధించి అమెరికాలో నిర్వహించే సమావేశానికి అర్హత సాధించిందన్నారు. అంతర్జాతీయ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నంద్యాలకు చెందిన బి సరస్వతి ఎంపిక కావడం నంద్యాల బ్రాంచుకే గర్వకారణమన్నారు. అలాగే గెలాక్సీ క్లబ్ అనే సంస్థలో కూడా అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా సరస్వతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏవోసుబ్బరాయుడు, హెచ్.జి.ఏ. మురళి, ఏ. ఏ. ఓ. కరుణాకర్, ఎస్.బి.ఏ.ఎస్.పుల్లారెడ్డి లతోపాటు జివిఎన్ ప్రసాద్, కుమ్మిత శ్రీనివాసులు, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: