పేదలకు రంజాన్ కిట్ల పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్, హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా పేదవారికి రంజాన్ ఇఫ్తార్ కిట్స్ లను పంచుతున్న విషయం విదితమే. అలాగే ఈ సంవత్సరం కూడా గురువారంనాడు స్థానిక పూల సుబ్బయ్య కాలనీలోని బిలాల్ మసీదు ఆవరణలో పేదవారికి లక్షా డెబ్భై వేల రూపాయల విలువ కలిగిన ఇఫ్తార్ కిట్స్ ఆరు వందల రూపాయల నిత్యావసర వస్తువులు మరియు 20 కేజీ ల బియ్యం వంద మంది పేదలు,  వితంతువులు,అవసరార్థులకు జమాఅతె ఇస్లామి హింద్ మార్కాపురం పట్టణ శాఖ ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నయీమ్ విచ్చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ నయీమ్ మాట్లాడుతూ జమాఅతె ఇస్లామి హింద్ ఆధ్వర్యం లో సామాజిక,ఆధ్యాత్మికత కార్యక్రమాలతో పాటు సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గర్హనీయమని పేదవారికి తోడ్పడే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహామండలి సభ్యులు అష్రాఫ్ అలీ,మజ్లిసుల్ ఉలేమా పట్టణ అధ్యక్షులు హాఫిజ్ సాదిఖ్, జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ ఉపాధ్యక్షులు సికిందర్, కార్యదర్శులు న్యామతుల్లా,ఖాసిం బాష, ముహమ్మద్ ఖాన్, అజీజ్, కార్యకర్తలు నజ్మతుల్లా, హనీఫ్, షఫీ, అజీం, ఐవైయమ్ రాష్ట్ర సలహామండలి సభ్యులు అయూబ్ ఖాన్, ఐవైయమ్ పట్టణ అధ్యక్షులు ముజఫర్,యస్ఐఓ సభ్యులు ముహీం, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: