నాంపల్లి క్రిమినల్ కోర్టులో వాక్సినేషన్
వాక్సీన్ తీసుకున్నాక ఆల్కహాలు సేవించరాదన్న డాక్టర్లు
అధిక సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులకు వారి కుటుంబ సభ్యులకు వాక్సిన్ టీకాలు ఇచ్చారు. సీనియర్ వైద్యులు, డా. అనురాధ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, సుమారు మూడు వందల వరకు వాక్సినేషన్ అందించడం జరిగిందని ఆమె తెలిపారు. వాక్సిన్ తీసుకున్న వారు సుమారు ఐదు రోజులు ఆల్కహాలు సేవించరాదని, మత్తు ద్రావణాలు వాడితే ఇమ్మ్యూనిటి తగ్గిపోయి వాక్సిన్ ప్రభావం తగ్గిపోతుందని పేర్కొన్నారు.
వాక్సిన్ తీసుకున్న వారు సైతం మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరాన్ని, శానిటైజ్ లను వాడాలని సూచించారు. వాక్సీన్ తీసుకున్న వారికి జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చినట్లయితే పారాసెటమాల్ బిళ్ళ లను మాత్రమే వాడాలని సూచించారు. డా. మాలవ్య మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ కోవాక్సిన్ తీసుకున్న వారు రెండో డోసు 28 రోజుల తర్వాత, కోవిషీల్డ్ వాక్సీన్ తీసుకున్న వారు 45 రోజుల తర్వాత తీసుకోవాలని తెలివారు. కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డా. ప్రజ్వల మెడికల్ ఆఫీసర్ ఫిల్మ్ నగర్, అనిత, నిర్మల స్టాఫ్ సర్సులతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: