నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నందు...
సమ్మర్ క్యాంప్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నందు బాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను అకాడమీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ గెలివి సహదేవుడు విడుదల చేశారు. ఈ సందర్బంగా గెలివి సహదేవుడు మాట్లాడుతూ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించిన తర్వాత మొదటి సమ్మర్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు నిర్వహించడం నంద్యాల పట్టణ క్రీడాకారులకు ఎంతో శుభ పరిణామమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆటలు చిన్నారులకు ఎంతో అవసరమని ఇలాంటి సమ్మర్ క్యాంపులో ప్రావీణ్యం పొంది వారి వ్యక్తిగత ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఇటువంటి సమ్మర్ క్యాంపు ద్వారా కలుగుతుందన్నారు.
ఇటువంటి క్యాంపులను సద్వినియోగ పరుచుకోవాలి అని క్రీడాకారులకు సూచించారు. నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాన్ని తమ అకాడమీలో మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు, తెలిపారు ఇటీవల కాలంలో అకాడమీ క్రీడాకారులు పలు టోర్నమెంట్లో నందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి విజయాలు సాధించారని, గెలుపొందిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఇతర క్రీడాకారులు వృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఎండి శ్రీనివాస్ గుప్తా, ప్రభాకర్ గుప్తా, చీఫ్ కోచ్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: