సీపీఐ ఆధ్వర్యంలో..
అంబేద్కర్ కు ఘన నివాళ్లులు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130 జయంతి సందర్భంగా పట్టణములోని సి.పి.ఐ. ఆధ్వర్యములో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్యకార్యదర్శి అందె నాసరయ్య మాట్లాడుతూ యుగపురుషుడు ,కారణజన్ముడు , 138 కోట్ల ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పరిపాలనకు మూలమైన భారత ర్యాజంగా నిర్మాత డా || బి.ఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి దాయకమైన జీవితం ఎందరికో ఆదర్శం అని, ముఖ్యంగా ఆయన ప్రపంచంలోనే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
దళితులకు హక్కులను కల్పించాడు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన మేధస్సుతో కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్య హక్కులను సమానంగా ఏర్పాటు చేసి సాంఘిక అసమానతలు తలెత్తకుండా చేసి ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకంగా డా.అంబేద్కర్ నిలిచారని పేర్కొన్నారు.
అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ మార్కాపురం పట్టణ నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య పట్టణ కార్యదర్శి షేక్ ఖాసిం సిపిఐ నాయకులు దుప్పట్ల కాశయ్య ఎం వెంకయ్య ఎం ప్రసాదు మొదలగు వారు పాల్గొన్నారు.
మార్కాపురం పట్టణ కార్యదర్శి షేక్. ఖాసీం
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషాజానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: