సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ 'ప్రణవం'

# ఊర్వశి ఓటిటి విడుదల

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     తన భార్యను హత్య చేశాడనే అభియోగంపై అరెస్టైన ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడా... లేక కటకటాలపాలయ్యాడా అనే ఇతివృత్తంతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రణవం'. 

     'ఈరోజుల్లో' ఫేమ్ శ్రీమంగం, అవంతిక, హరి నల్వా, దొరబాబు, జెమినీ సురేష్, జబర్దస్త్ బాబీ ముఖ్య తారాగణంగా.. 'చరిత & గౌతమ్ ప్రొడక్షన్' పతాకంపై కుమార్.జి దర్శకత్వంలో తనూజ సోంపల్లి నిర్మించిన ఈ చిత్రం ఊర్వశి ఓటిటి ప్రేక్షకులను ఈనెల 7 నుంచి అలరించనుంది.

     హీరో శ్రీ మంగం మాట్లాడుతూ.. 'ఓటిటి ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మూవీ 'ప్రణవం'. మర్డర్ బ్యాక్ డ్రాప్ లో చాలా ఆసక్తికరంగా సాగే ఈ చిత్రంలో సస్పెన్స్ తోపాటు... సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారికి మా 'ప్రణవం' చిత్రాన్ని చేరువ చేస్తున్న 'ఊర్వశి ఓటిటి' వారికి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం" అన్నారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: