యువకళావాహిని వై కె కనుమూత..!

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సాంస్కృతిక దిగ్గజం యువకళావాహిని వ్యవస్థాపకులు  లయన్ వై కె నాగేశ్వరరావు ఇక లేరు!  మూడు రోజుల నుంచి దగ్గు, తీవ్ర జలుబు తో బాధ పడుతున్నారు!  కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ వచ్చింది! కానీ కాసేపటి క్రితం  హఠాత్తుగా పల్స్  పడిపోవడం తో వివేకానంద నగర్ హోలిస్టిక్  ఆసుపత్రికి తరలించారు.గుండెపోటు తో కనుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు!  కాసేపట్లో వారి ఇంటికి భౌతిక కాయాన్ని తీసుకు రానున్నారు! 

యువకళావాహిని  నాలుగున్నర దశాబ్దాల క్రితం స్థాపించి వేలాది సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, నటుడిగా చారిత్రాత్మక నాటక ప్రదర్శనలు, చర్చా వేదికలు, సాంస్కృతిక సభలకు అధ్యక్షులుగా ఎన్నో ఎన్నెన్నో చేసి జీవితాన్ని సాంస్కృతిక రంగానికి అంకితం చేసిన మహానుభావులు నాగేశ్వరరావు గారు!  సహకార శాఖ లో ఉద్యోగం చేస్తూ, మరో వైపు నాటకోత్సవాలు నిర్వహిస్తూ మమేకం  అయిపోయారు!  పదవీ విరమణ తరువాత పూర్తిగా సాంస్కృతిక రంగానికి అంకితం అయ్యారు!  స్వామి వివేకానంద నాటకం లో ప్రధాన పాత్రను పోషించి అమెరికా తో పాటు దేశం లోని అనేక నగరాల్లో 150 ప్రదర్శనలు పూర్తీ చేసి రికార్డ్  సృష్టించారు! 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: