భూమా కుటుంభంతోనే అభివృద్ధి

- ఘనంగా భూమా బ్రహ్మానందరెడ్డి జన్మదిన వేడుకలు

- రక్తదానాలు, అన్నదానాలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో భూమా కుటుంబంతోనే అభివృద్ధి జరిగిందని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పిచ్చుక నాగార్జున, మాబువలి, జైనాబిలు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేకులను అభిమానులు, పిల్లల మధ్య కట్ చేశారు. విజయ బ్లడ్ బ్యాంక్ లో యువత పెద్దసంఖ్యలో రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంక్ నందు టిడిపి కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 30 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అదేవిధంగా నంద్యాల ఎస్.ఆర్.బి.సి కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఉన్న ఎయిడ్స్ బాధిత పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా టిడిపి కౌన్సిలర్లు మాబువలి, నాగార్జున, జైనాబీ, శ్రీదేవిలు మాట్లాడుతూ యువ నాయకుడు భూమా బ్రహ్మానంద రెడ్డి జన్మదినం సందర్భంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు ఎంతగానో సంతోషంగా, ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే మా నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని,  రాబోయే రోజుల్లో ఆయన ఇంకెన్నో అత్యున్నతమైన పదవులను అలంకరించాలని ఈ సందర్భంగా వాళ్ళు దేవుడితో ప్రార్థించారు.  అభివృద్ధికి చిరునామా భూమా కుటుంబమని, నంద్యాల పట్టణంలో ఎందరో నాయకులు పదవులు పొంది ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. భూమా కుటుంబం నంద్యాలలో రంగ ప్రవేశం చేయడంతో అభివృద్ధి జరిగిందన్నారు. భూమా నాగిరెడ్డి హయాంలో పేదల కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 13 వేల ఇళ్లను మంజూరు చేయించిన ఘనత ఆ కుటుంబానికే దక్కిందన్నారు.
నంద్యాల పట్టణ ప్రజలను పట్టి పీడిస్తున్న రోడ్ల  వెడల్పు సమస్య ఆయన మృతి చెందినా రోడ్ల వెడల్పు ఆ కుటుంబానికే  దక్కిందన్నారు. మంచినీటి ఎద్దుడి నివారించేందుకు అమృత్ పథకం వచ్చేందుకు కృషి చేసారని వివరించారు. రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదన్నారు. నంద్యాలలో ఈ ప్రభుత్వ హయాంలో కాల్వల్లో మట్టి కూడా తొలగించలేరని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపై నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దికెర కైలాస్, పిచ్చికే గురుప్రసాద్, తిమ్మయ్య, దస్తగిరి, ముద్దం నాగ నవీన్, బుజ్జి, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: