ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం నియోజకవర్గ శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కోవిడ్ వైరస్ నియంత్రణ, వ్యాకిన్ వేగంగా ప్రజలకు అందించడానికి తీసుకోవలసిన చర్యల పై రెవెన్యూ, మున్సిపల్, పోలీస్,వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం పట్టణమలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నoదున మున్సిపల్ మరియు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు.మార్కాపురం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లాలన్నారు.కరోనా వైరస్ పాజిటివ్ కేసులో పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ హాస్పిటల్స్ పంపాలని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్ తో వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన చెప్పారు. మార్కాపురం పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అందరూ మాస్క్ లు ధరించే విధంగా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలుసామాజిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలన్నారు.ఈ సమావేశంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, డి.ఎస్.పి కిషోర్ కుమార్,డిప్యూటీ వ్ డి.ఎం.హ్.ఓ రాహుల్, వైద్యులు వెంకటేశ్వర నాయక్,తహసీల్దార్ విద్యాసాగరుడు ,ఎంపీడీఓ హనుమంతరావు, సి.ఐ రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్. కిషోర్ కుమార్ --డి.ఎస్.పి. మార్కాపురం
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: