ఆదర్శ నాయకుడు... భారత రాజ్యాంగ రూపశిల్పి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

నర్రి స్వామి కురుమ

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

దళిత బహుజనులు అంతా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు వెళ్లాలి  తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫర్ సోషల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స్వామి పిలుపునిచ్చారు. బుధవారంనాడు హైదరాబాదులోని ఎల్బీనగర్ చౌరస్తాలో బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి  స్వామి కురుమ గారు మాట్లాడుతూ దళిత బహుజన కోసం భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయులు నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు తన అనుభవించినటువంటి జీవిత కష్టాలని భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు అనుభవించ వద్దని చెప్పి భారత రాజ్యాంగంలో దళిత బహుజనులకు పెద్ద పీట వేసి జనాభాలో అధిక శాతం ఉన్న దళిత బహుజనులకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను దీన్ని ఉపయోగించుకుని రాజులు అవుతారో నిన్ను నమ్ముకొని బానిసలు అవుతారో మీరే నిర్ణయించుకోవాలి అన్నారు.


  ఆ మహానీయుడు సూచించిన విధంగా దళిత బహుజనూలు అందరూ ఏకమై ఓటు ఓటు బ్యాంకుగా తయారై రాబోయే రోజుల్లో మన ఓటు మన వేసుకొని దళిత బహుజనులు రాజ్యాధికారం దిశగా ప్రయత్నించాలని రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా నర్రి  స్వామి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పార్టీల అధినేతలు దళిత బహుజనులకు సంక్షేమ పథకాల కింద రాయితీలు ఇవ్వడం కాదు ఎమ్మెల్యే ఎంపీ రాజ్యాంగ పదవులు వారి జనాభా ప్రకారం వారికి వచ్చే విధంగా చూసి వారిని రాజ్య పాలకులుగా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు నర్సింగ్ రావు రాజు మైసయ్య మోటే  మహేష్ మధుసూదనా చారి ముత్యాల మహేష్ న్యాయవాది హరితా దేవి గీతాదేవి మహిళా సంఘం నాయకులు మహిళా నాయకురాలు ఉపేంద్ర యాదవ్ వివిధ సామాజిక దళిత బహుజన సంఘాల నాయకులు యువకులు మేధావులు పాల్గొన్నారు.








 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: