రంజాన్ మాసం ప్రారంభంలోనే కరోనా ప్రభావం
చారిత్రాత్మక కట్టడాలు చార్మినార్, మక్కామజీద్ మూసివేత
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రము లోని అన్ని జిల్లాలకు కరోనా ప్రభావం సోకుతున్న సమయంలో ఈ ఏడాది కూడా రంజాన్ ఉపవాసాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చారిత్రాత్మక కట్టడాలు చార్మినార్, మక్క మజీద్ లను మూసి వేశారు. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో కర్ఫ్యూ, బంద్ లను ఆదేశించే అవకాశాలే లేవని మంత్రి ఈటెల అన్నారు. గాంధీ ఆసుపత్రి నీ పూర్తి స్థాయిలో కరోనా కేసుల నిమిత్తం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింలు దినమంతా ఉపవాసం చేసే వారు కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గుంపులు గుంపులుగా జనం గుమిగూడి ఉండకూడదని పేర్కొంటున్నారు. ప్రార్థన మందిరాలకు వెళ్ళే వారు నిభందనలు పాటించాలని సూచించారు. గతేడాది రంజాన్ మాసంలో ఇళ్ళల్లో నే ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది అలాంటి నిబంధనలు లేవు. అన్నీ దుకాణాలు, పండ్లు అమ్మేవారు, ప్రార్థన మందిరాలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: