రాజ్యాంగాన్ని....రిజర్వేషన్లను రక్షించుకుందాం
అంబేడ్కర్ సాక్షిగా పోరాటానికి సన్నద్ధం కండి
(జానోజాగో వెబ్ న్యూస్-మడకశిర ప్రతినిధి)
మడకశిర పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ లో జరిగిన అంబేడ్కర్ జయంతి దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ప్రసంగిస్తూ దేశంలో గత ఏడు సంవత్సరాలుగా దేశంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగంపై రిజర్వేషన్ల పై దళితులపై మైనారిటీ లపై బడుగు బలహీన వర్గాలపై మూక దాడులు అత్యాచారాలు లెక్కలేనన్ని జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా మతోన్మాదులకు వత్తాసు పలుకుతూ
రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ భావప్రకటనా స్వేచ్ఛ కు అడ్డుతగులుతూ ప్రజా స్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర దేశానికి బలహీనం చేసి మనువాద దేశంగా మార్చే కుట్ర జరుగుతోందని దీన్ని కుల మతాలకు వర్గ వర్ణాలకు జాతులకు అతీతంగా ఒక్కటై రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా స్థానిక మడకశిర వైఎస్సార్ సీపీ శాసన సభ్యులు తిప్పేస్వామి గారు జిల్లా సీపీఐ నాయకులు దాదాపీర్.ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: