జర్నలిస్ట్ అమర్నాథ్ కన్నుమూత

ప్రముఖుల సంతాపం

(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ కన్నూమూసారు. ఆయన మరణం పట్ల రాజకీయ, జర్నలిస్ట్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అమర్నాథ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అమర్నాథ్ జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా సేవలందించారు.

జర్నలిస్ట్ గా అమర్నాథ్ ప్రస్థానం... 

ఆంగ్లం లో వెలువడిన సోవియట్ యూనియన్ పత్రిక సోవియట్ భూమి పేరు తో తెలుగులో ప్రచురించే వారు.  సోవియట్ భూమి లో సబ్ ఎడిటర్ గా అమర్నాథ్ జర్నలిస్టు జీవితం ప్రారంభం అయింది. సోవియట్ భూమి పత్రిక కు తాపి ధర్మారావు గారి కుమారుడు తాపి రాంమోహన్ రావు ఎడిటర్ గా ఉండేవారు. ఆయన శిష్యుడిగా  అమరనాథ్ మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు.  ఆ తర్వాత విశాఖపట్నం లో విశాలాంధ్ర లో కొంతకాలం పాటు పనిచేసి 1982లో  గజ్జల మల్లారెడ్డి గారు ఆంధ్రభూమి ఎడిటర్ గా ఉన్న సమయం లో అమర్నాథ్ గారు సబ్ ఎడిటర్ గా చేరారు. సిపిఐ భావజాలం కలిగిన చాలా మంది జర్నలిస్టులు మల్లారెడ్డి గారి హయాం లో ఆంధ్రభూమి లో చేరారు. వీరందరినీ మగ్దుం భవన్ బ్యాచ్ గా పరిగణించేవారు. ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ స్థాయి కి ఎదిగారు. న్యూస్ ఎడిటర్ గా విజయవాడ, రాజమండ్రీ, హైదరాబాద్ లో పనిచేసి 2008 లో  ఉద్యోగ విరమణ చేసారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రధాన కార్యదర్శి గా,  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శిగా, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు.  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ప్రచురించే స్క్రైబ్ న్యూస్ మాస పత్రిక ఎడిటర్ గా ప్రస్తుతం పెంచేస్తున్నారు. ఈ పత్రిక ఏప్రిల్  2021 సంచిక కు కూడా ఈ నెల మొదటి వారంలో వెలువడింది. అందులో అమరనాథ్ ఎడిటోరియల్ రాసారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: