ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాజిటివ్

స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడి

చికిత్స అందిస్తోన్న డాక్టర్ల బృందం 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లు ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో హోమ్ ఐసోలేశన్ ద్వారా డాక్టర్ల బృందం చికిత్స అందిస్తున్నారు. అధికారిక కార్యకలాపాలు సోమేష్ కుమార్ నిర్వహిస్తున్నారు.

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా స్పీడు పెంచాలని ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తున్న తరుణంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లోనే 18 ఏళ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: