మనస్సెందుకు రావడంలేదు...
గొంతెందుకు పేలడం లేదు
అక్కడ వ్యాక్సినేషన్ కు...ఇక్కడ కోవిడ్ బాధితులకు
ఆసరగా నిలుస్తున్న మసీదు
మసీదులు ఆరాధన నిలయాలే కాదు సేవాలయాలు కూడా. ఇది అనాధిగా వస్తున్న ఆచారం. సందర్భం వచ్చినపుడల్లా మసీదులు ఇలాంటి పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. తాజాగా కోవిడ్ సెకండ్ వేయ్ నేపథ్యంలో పలుచోట్ల మసీదులు సేవలకు కేంద్రంగా మారుతున్నాయి. కోవిడ్ వ్యాక్సియేషన్ కేంద్రాలుగా కోవిడ్ బాధితులకు చికిత్సాలయాలుగా మసీదులు వేలుస్తున్నాయి. సమాజంలోని మంచిని చూపి చెడును ఖండించాల్సిన పాత్రను మీడియా పోషించాలి. కానీ మన దేశ మీడియా అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మన దేశంలో మీడియా ఎంతో ప్రభావం చూపినా దాని పాత్ర మాత్రం విమర్శలకు గురవుతోంది. కరోనా వ్యాధిని మన దేశం గుర్తించకముందే నిర్ణయించుకొన్న ఓ సమావేశంలో ముస్లింలు హాజరవ్వడాన్ని నాడు మీడియా భూతద్దంలో చూపి విమర్శలు గుప్పించింది. దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లీగీ జమాత్ వారే కారణ మని నాడు కోడై కూసింది. అంతేకాదు మసీదులను తప్పుపడుతూ తబ్లీగీలకు మసీదులు ఆశ్రమిస్తున్నాయని లేని దుష్ప్రచారాన్ని మీడియా చేసింది. కారణం మీడియా కార్పోరేట్ శక్తుల చేతుల్లో ఉండటం, ఆ కార్పోరేట్ శక్తులు మనువాదుల చేతల్లో కీలుబొమ్మలుగా మారడమే ఇందుకు కారణం.
ఇక మీడియా వాస్తవాన్ని తెలియజేసే పాత్రను పోషించాలి. నేడు ఆ పాత్రను పూర్తిగా మీడియా విస్మరిస్తోంది. తాజాగా మన దేశంలోని మసీదులు కోవిడ్ సెకండ్ వేయ్ సమయంలో సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇటీవల మధ్య ప్రదేశ్ లోని భోపాల్‌లో అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ -19 యొక్క నివారణకు, వ్యాక్సిన్ వేసే కేంద్రంగా ఆసియాలోని అతిపెద్ద మసీదులలో ఒకటైన చారిత్రక తాజ్-ఉల్-మసాజిద్ యొక్క ప్రాంగణాన్ని జిల్లా పరిపాలనా యంత్రాంగం ఉపయోగించుకుంటోంది. వ్యాక్సిన్ వేసే కేంద్రంగా మసీదును ఇచ్చేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. భోపాల్ నగరం లోని పాత భోపాల్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి భోపాల్ జిల్లా పరిపాలన తీసుకొన్న చొరవలో ఇది ఒక భాగం, ఇక్కడ అన్ని వర్గాల వందలాది ప్రజలకు టీకాలు వేశారు.
మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌డిఎం జమీల్ ఖాన్ మాట్లాడుతూ అన్ని మతాల ప్రజలు తాజ్-ఉల్-మస్జిద్ ప్రాంగణానికి వ్యాక్సినేషన్ కోసం వచ్చారు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి జిల్లా యంత్రాంగం తాజ్-ఉల్-మస్జిద్ ప్రాంగణాన్ని ఉపయోగించుకోన్నది అని ఆయన వెల్లడించారు. టీకాలు వేయడానికి తాజ్-ఉల్-మస్జిద్ ప్రాంగణాన్ని ఉపయోగించడానికి అనుమతి కోరే ముందు జమీల్ ఖాన్, కోవిడ్ టీకా గురించి భోపాల్ షహర్ ముఫ్తీ అబ్దుల్ కలాం కస్మి నుండి ‘ఫత్వా’ కోరారు.. భోపాల్ షహర్ ముఫ్తీ టీకాలు వేస్తే, “ఎవరికీ ఎటువంటి హాని లేదు” అని ఫత్వా జారీ చేసారు. టీకా కార్యక్రమం వేగవంతం చేయబడుతుందని, ప్రత్యేకించి సమాజంలోని బలహీన వర్గాలకు ఇది ఉపయోగపడుతుంది, మైనారిటీ కమ్యూనిటీ సభ్యుల సహాయంతో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌డిఎం జమీల్ తెలిపారు. ప్రజలకు అవగాహన కలిగించడానికి మత పెద్దల సహాయం కూడా తీసుకుంటున్నారు. తాజ్-ఉల్-మస్జిద్ వద్ద జరిగిన ఈ శిబిరానికి ముందు, భోపాల్ షహర్ ఖాజీ మౌలానా సయ్యద్ ముష్తాక్ అలీ నద్వి, షహర్ ముఫ్తీ అబ్దుల్ కలాం కస్మి కూడా భోపాల్ నివాసితులకు మనోబలం ఇవ్వడానికి గాను స్వయంగా టీకాలు వేయించు కొన్నారు. చారిత్రక మసీదు సమీపంలోని కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులు, దుకాణాల యజమానులు ఈ శిబిరంలో టికా వేయించు కొన్నారు. అంతే కాకుండా గుజరాత్ రాష్ట్రలోని మొఘల్ పురా ( వడోదర గుజరాత్ ) లోని జహంగీర్ పురా మసీదును ప్రజల కోసం కోవిడ్ హాస్పిటల్ గా మార్చిన ముస్లింలు తమ మానవత్వాన్ని చాటుకొన్నారు.
వాస్తవానికి మసీదుల పాత్ర ఇదే. ఆరాధనతోపాటు విద్య, వైద్య, ఇతర సేవలు గతం నుంచి మసీదులు అందిస్తూ వచ్చాయి. ఇలాంటి వాస్తవాన్ని తెలియజేందుకు నేడు మీడియా ముందుకు రావడంలేదు. మసీదులు అందిస్తున్న ఈ సేవాలను కనీసం చూపించడానికి, ప్రచురించడానికి మీడియా ఆసక్తి చూపడంలేదు. కారణం మీడియా యాజమాన్యంలోని ఆలోచన విధానమే. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అనేకం మన దేశంలో జరుగుతున్నాయి. కానీ వెలుగులోకి రావడంలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని నేడు ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. నేడు సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర నాలుగో స్థంభంగా ఉన్న మీడియా పోషించడంలేదు. ఇదే పరంపరను మీడియా కొనసాగిస్తే ప్రజలు సోషల్ మీడియానే నమ్మే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: