ఆలేరు మున్సిపల్ టీపీఓ,
అతని అసిస్టెంట్ ను సస్పెండ్ చేయాలి..
వారు అక్రమ ఇంటి నిర్మాణానికి అండగా నిలుస్తున్నారు
ఆర్టీఐ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు ఖుర్షీద్ పాషా విమర్శ
(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)
పారదర్శకం గా, జవాబుదారీతనం గా పని చేయాల్సిన అధికారులు,అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తూ, ప్రోత్సహిస్తున్న ఆలేరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి, అతని అసిస్టెంట్ ను సస్పెండ్ చేయాలని ఆర్టీఐ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఖుర్షీద్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఆలేరు లో మాట్లాడుతూ ఆలేరు ఖబ్రస్తాన్ స్థలంలో అనుమతులు లేకుండా అక్రమ ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని,ఆలేరు మజీద్ కమిటీ సభ్యులు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినా,ఎలాంటి చర్యలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మత పరమైన ఇబ్బందులు,తలెత్తే అవకాశాలు ఉన్నందున,సున్నితంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నా,బాధ్యతలు మరిచి,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు.గత నెల రోజులుగా ,ప్రజలకు కనిపించే విధంగా,పాత జాతీయ రహదారి ప్రక్కనే అక్రమ నిర్మాణం సాగిస్తున్నా, ఎందుకు చర్యలు తీసుకోలేధో తెలుపాలన్నారు.
ముస్లింలకు ఇంటి కంటే పవిత్రమైన ఖబ్రస్టాన్ స్థలం లో, దర్జాగా నిర్మాణం కొనసాగిస్తున్న కన్నులు ఉండి చూడలేని కబోదు లలా పట్టించుకోవడం లేదన్నారు.అక్రమ ఇంటి నిర్మాణాన్ని చేబడుతున్న వ్యక్తే, ఏ అధికారి నన్నేం చేయలే డని,అనుమతులు లేకుండానే నిర్మిస్తా...మీరు ఏం చేసుకుంటారో చేసుకో అని చెబుతుంటే,ఈ టీపీఓ, అతని అసిస్టెంట్ ఎంత మొత్తంలో డబ్బు పుచ్చుకున్నారో... అర్థమవుతున్నదన్నారు.నీతి, నిజాయితి గా పనిచేయాల్సిన అధికారులు అక్రమ నిర్మాణ దారులకు అండగా నిలుస్తుం డడం సిగ్గు చేటన్నారు.వీరి పాపంలో భాగమైన మున్సిపల్ కమిషనర్, మేనేజేర్ లపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా ఉండకుండా,సమయానికి రాకుండా,వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్న పై అధికారుల పై ,జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేసిన ఇంటిని, కూల్చివేయాలని,నిర్మాణ దారునిపై కేసు నమోదు చేయాలన్నారు.ఈ విషయమై నిర్లక్ష్యం వహిస్తే ..అధికారులపై చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు.
Post A Comment:
0 comments: