ఆదర్శనీయంగా...
అంగన్వాడీ భవనాలు
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల పరిధిలో అంగన్వాడి భవనాలను ఆదర్శంగా తీర్చిదిద్దేతే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐసిడిఎస్ అధికారులు శనివారం తెలిపారు. మన అంగన్వాడీలు నాడు నేడు గురించి అభివృద్ధి కమిటీ సభ్యులతో తర్లుపాడు ఐసిడిఎస్ కార్యాలయం నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాత భవనాల మరమ్మత్తుల కొత్త భవనాల నిర్మాణ విషయంలో కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇతర అంశాలపై సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీదేవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, మహిళా పోలీసులు, అంగన్వాడి కార్యకర్తలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: