అందాకారంలో ఆలేరు పట్టణం

మృత్యువు బారిన పడుతున్న ప్రజలు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

గత నెల రోజులుగా ఆలేరు పట్టణం లో వివిధ కాలనీ లలో  ప్రధాన రోడ్డు వెంబడి వీధి దీపాలు మరియు ఆర్ టీ సి బస్టాండ్ లో  వెలగడం లేదని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు బస్టాండ్ లో చీకటి వేళలో బిక్కు బిక్కు మంటూ వేచి చూడాల్సి వస్తుంది ప్రధాన రోడ్డు వెంబడి  చీకటి వలన  ఎదురుగా వచ్చే వాహనాల లైట్స్ వెలుతురుకు ఇరుకుగా ఉన్న రోడ్ల వలన తరచు ప్రమాదాలు చోటు చేసుకుని వికలాంగులుగా మరియు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
అలాగే పట్టణం లోని సెంట్రల్ లైటింగ్ అసంపూర్తిగా నిలిచి పోవడం వలన అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు లేకపోవడం వలన ఆదివారం రాత్రి మందనపల్లి గ్రామం కు చెందిన  డ్యాగలా రాజు అనే యువకుడు మృత్యువు పాలయ్యాడని ఈ సమస్యలపై పాలకులకు అధికారులకు పలు మార్లు విన్నవించిన పెదచేవినా పెడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు ఇకనైనా వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: