మాస్క్ లు ఉచితంగా పంపిణీ చేయాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మాస్క్ లు పంపిణీ చేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. మెడికల్ షాపుల్లో మాస్క్ లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. కావున ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా మాస్క్ లు పంపిణీ చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారీ దూకుడు ప్రదర్శిస్తోందని, ఏపీలోనూ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం మాస్క్ లను విస్త్రుతంగా ఉచితంగా పంపిణీ చేయాల్సిన అవసరముందన్నారు. కరోనా నియంత్రణకు పరిశుభ్రత కూడా కీలకమని ఆ దిశగా అన్నిపంచాయతీల్లో, మున్సిపాలిటీలలో సిబ్బంది పరిశుభ్రతపై శ్రద్ద పెట్టేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: