ఆజాద్ సెంటర్ పేరు మార్పు డిమాండ్ సరికాదు

ముస్లిం ప్రజా సంఘాల వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ పేరు మార్చరాదు అంటూ ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా   ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్.మస్తాన్ వలి, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి రఫీ, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎం డి యూనుస్, అవాజ్ యూత్ పట్టణ అధ్యక్షుడు సద్దాం మాట్లాడుతూ 2016 లో ముస్లిం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం వల్ల నాటి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎన్.ఎం.డీ.ఫరూఖ్ చొరవ తీసుకొని అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ పేరు పెట్టారని వారు తెలిపారు.

 


ఈ సెంటర్ లో ఎన్.ఎం.డీ.ఫిరోజ్ తన సొంత నిధులతో  అబ్దుల్ కలామ్ ఆజాద్ మినార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు వెనక ఇంతటి పోరాట చరిత్ర ఉందని, ఇది తెలియని కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ కు అంబేద్కర్ సర్కిల్ గా పేరు పెట్టాలని డిమాండ్ చేయడం సరైంది కాదన్నారు. ఈ నినాదాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ప్రజాసంఘాల నాయకులు కోరిన విధంగా కె మార్కెట్ గాని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర గాని స్టేట్ బ్యాంక్ కాలనీ సెంటర్ గాని పెట్టాలని, అలా పెట్టిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ, చైర్పర్సన్, కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టరు, డీఎస్సీ ఆర్అండ్ బి అధికారులు ఈ విషయాన్ని గ్రహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని ఎడల కుల, మతాల చిచ్చుపెట్టిన వారవుతారని వారు పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా బాధ్యులవుతారని వారు తెలిాపరు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మహమ్మద్ అజీమ్, టిడిపి నాయకులు సర్దార్, ఫయాజ్, ఖలీల్, యూనిస్, మా భాష, సంజు ఖాన్, ఎస్డీపీఐ నాయకులు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: