వైయస్సార్ జలకళ కార్యక్రమంలో,,,
పాల్గొన్న ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల పరిధిలో కలుజువ్వలపాడు పంచాయతీ పరిధిలో వైయస్సార్ జలకళ పథకం లో భాగంగా 200 బోర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం మడమ తిప్పని నేత అనుకున్న లక్ష్యం సాధించేవరకు నిద్రపోడు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ఉన్నారు.
ఇలా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ కె శీనా రెడ్డి మాట్లాడుతూ ఈ క్లస్టర్ పరిధిలో వైయస్సార్ జలకళ పథకం రైతులకు వరం లాంటిదని రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఎం డి ఓ ఎస్ నరసింహులు, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు, టి ఎ కుందూరు అనిల్, మరియు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: